దర్బార్‌తో మీ నమ్మకాన్ని వమ్ము చేయను - రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌ల ఫస్ట్ క్రేజి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రజిని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి తెలుగులో విడుదల చేస్తున్నారు.
అనిరుద్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ..``సుభాస్కరన్ నాకు మంచి స్నేహితుడు. తనొక సినిమా ప్రొడ్యైసర్‌గానే మనకు తెలుసు. కానీ తను లండన్ లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. సమాజానికి సేవ చేస్తున్నాడు.
తన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో నేను 2.0 సినిమా చేసే సమయంలో మా బ్యానర్ లో మరో సినిమా చేయాలని ఆయన నన్ను అడిగాడు నేను సరేనన్నాను. ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగదాస్‌గారు ఆలోచనలోకి వచ్చారు.
ఆయన డైరెక్ట్ చేసిన రమణ, గజినీ చిత్రాలు నాకు బాగా నచ్చాయి అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. `కబాలి`, `కాలా` సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగదాస్.
అయితే `పేట` చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని కదా! అని ఒక వారంలోనే `దర్బార్` కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ఈ సినిమా ప్రారంభమైందీ చిత్రం.
సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత శంకర్‌లా ఎంటర్‌టైన్‌మెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే దర్శకుడు మురుగదాస్‌తో పనిచేయం ఆనందంగా అనిపించింది.
ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని హంగులుంటాయి. అలాగే సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్‌తో దళపతి తర్వాత 29 ఏళ్లకు కలిసి పనిచేసిన సినిమా. అభిమానులు నాపై నమ్మకంతో ఉన్నారు. వాళ్ల నమ్మకాన్ని దర్బార్ వమ్ము చేయదు అన్నారు.