మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (17:09 IST)

రజినీకాంత్+కమల్ హాసన్ = 0+0 =0, రజినీ-కమల్ పొలిటిక్స్ పైన సెటైర్స్

తమిళనాడులో 2021లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకె అనే ఫార్ములాకి చెక్ పెట్టేందుకు రజినీకాంత్, కమల్ హాసన్ ద్వయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ రెండు పార్టీలను మట్టికరిపించి తాము అధికారంలోకి రావాలని సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఇదిలావుంటే రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఒకరికొకరు చేతులు కలిపి రాజకీయాల్లోకి రావడంపై అధికార అన్నాడీఎంకె పార్టీ నేత, రాష్ట్ర రెవిన్యూశాఖామంత్రి ఉదయ్ కుమార్ సెటైర్లు పేల్చారు. రజినీకాంత్+కమల్ హాసన్ = 0+0 =0 అంటూ ఫార్మూలా చెప్పారు. వాళ్లు ఎవరికివాళ్లే పెద్ద జీరోలనీ, జీరో మరో జీరోతో కలిస్తే ఫలితం జీరోనే తప్పించి మరొకటి రాదంటూ ఎద్దేవా చేశారు. 
 
వాళ్లిద్దరూ కలిసి రాజకీయాల్లో కంటే సినిమాలో నటిస్తే సూపర్ హిట్ అవుతుందని అన్నారు. అసలు రజినీకాంత్ పార్టీ వుందో లేదో తెలీదనీ, ఆయన ప్రారంభిస్తారో లేదోనని ఆయన అభిమానులే తలలు బద్ధలు కొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు.