గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (15:33 IST)

సమంత అక్కినేని, శర్వానంద్‌ల 96 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ప్రస్తుతం తమిళ రీమేక్ 96లో నటిస్తుంది. హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా 96 పేరుతో వచ్చిన ఆ సినిమా అక్కడి ప్రేక్షకుల్నీ విపరీతంగా ఆకట్టుకుంది.

అంతేకాదు మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. 
 
షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న జాను, పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది. దీంతో సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది సినీ యూనిట్. జాను సినిమాను 2020 ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. సమంత ఓ కుక్క పిల్లను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. సమంత, నాగచైతన్యలు యష్ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. అయితే ఈ కుక్క పిల్ల కంటే ముందు సమంత మరో కుక్క పిల్లను పెంచుకుంది. దాని పేరు బుగాబు.. అయితే ఆ కుక్క పిల్ల వచ్చిన నాలుగు రోజులకే ప్రమాదకర వైరస్ సోకి చనిపోయింది. దీంతో సమంత గుండెలు పగిలేలా ఏడ్చిందని చెప్పింది.
 
ఆ సమయంలో చైతూ తనను ఎంతో ఓదార్చాడని తెలుపుతూ.. దానికి సంబందించిన ఓ వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా సోషల్ మీడియా ద్వారా సమంతను ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు.