ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (17:39 IST)

ఏఎన్నార్ అవార్డ్ ఫంక్షన్.. సమంత అందుకే రాలేదా?

దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు జాతీయ పురాస్కారాల ప్రదానోత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హాజరు కాలేదు. ప్రస్తుతం దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. 2018 ఏడాదికి గానూ దివంగత నటి శ్రీదేవి, 2019 ఏడాదికి గానూ ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ ఏఎన్నార్ అవార్డుకు ఎంపికయ్యారు. 
 
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాదు టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు, దర్శకలు, నిర్మాతలు హాజరై సందడి చేశారు. నాగేశ్వర రావు కుటుంబానికి చెందిన మూడు తరాల వారసులు ఈ వేడుకకు హాజరయ్యారు. కానీ అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, నాగచైతన్య భార్య సమంత మాత్రం ఆ వేడుకలో కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సమంత లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనబడింది. దీనిపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చ మొదలెట్టారు. 
 
సమంత ప్రస్తుతం 96 అనే తమిళ రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను ముగించుకుంది. ఈ నేపథ్యంలో సమంత హాజరుకాకపోవడానికి గల కారణం అర్థం కాలేదు. అయితే సమంత అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. బహుశా ఆ షూటింగ్‌లో  ఉండి రాలేకపోయిందేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.