గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (15:54 IST)

ఉపాసనకు అరుదైన ఘనత.. మిస్టర్ ''సి''నే కారణం.. సమంత ప్రశంసలు

కొణిదెల కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్ ఉపాసనకు అభినందనలు తెలిపింది. ఉపాసన ఛానల్ ఏకంగా లక్ష సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందిస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది. ఉపాసన కొణిదెల అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేస్తోంది. 
 
అలాగే తనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేనా.. రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. 
 
ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఉపాసన ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి 'బీ పాజిటివ్' అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈ మేరకు ‘బిపాజిటివ్ విత్ ఉపాసన' పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించి పలువురు సెలెబ్రిటీల చేత హెల్త్ టిప్స్ చెప్పిస్తూ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తోంది. దీంతో ఉపాసన ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానల్‌కి బాగా ఆదరణ పెరిగింది. తనకు వచ్చిన ఈ సిల్వర్ ప్లగ్ మొమెంటోను మెగా అభిమానులకు చూపిస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. 
 
ఈ సందర్బంగా ఈ మైలురాయికి చేరుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ.. దీనంతటికీ ప్రేరణ మిస్టర్ సి (రామ్ చరణ్) అని పేర్కొంది ఉపాసన. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి సమంత స్పందిస్తూ ప్రత్యేక సమంత అభినందలు తెలిపింది. ఉపాసన సాధించిన అరుదైన ఘనతను ఆమె సన్నిహితురాలు అక్కినేని సమంత అభినందలు తెలిపింది.