వెంకీమామ ట్రైలర్.. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులకు ట్రీట్ (Video)

సెల్వి| Last Updated: సోమవారం, 9 డిశెంబరు 2019 (13:14 IST)
విక్టరీ వెంకటేష్, కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ వెంకీ మామ సినిమా నుంచి ప్రస్తుతం ట్రైలర్ అవుట్ అయ్యింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఏంటో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.

నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పక్కగా ట్రైలర్‌ని కట్ చేశారు.

స్క్రీన్ పైన మామా అల్లుళ్లుగా అదరగొట్టారు వెంకీ, చైతూ. కుటుంబ నేపధ్యంతో పాటు మాస్ అంశాలను కూడా బాగానే తెరకెక్కించాడు బాబీ. ముఖ్యంగా ట్రైలర్‌లోని డైలాగ్స్ బాగా పేలుతున్నాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి
దీనిపై మరింత చదవండి :