సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 5 డిశెంబరు 2019 (22:13 IST)

నా కెరీర్లో ఆ సినిమాల‌ను మ‌ర‌చిపోలేను - నాగ చైత‌న్య‌

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ సినిమాకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. ఈ సినిమా డిసెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో వెంకీ మామ టీమ్ ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు.
 
ఈ సినిమా గురించి నాగ చైత‌న్య ఏమ‌న్నారంటే... “డిసెంబ‌ర్ 13న `వెంకీమామ‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. వారం ప‌దిరోజులుగా యూనిట్ అంద‌రిలో థ్రిల్ల‌ర్ సినిమాలా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ డిస్క‌ష‌న్ న‌డిచింది. ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ దొరికింది. ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్‌. నా కెరీర్‌లో మ‌నం, వెంకీమామ చిత్రాలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. రేపు ఎన్ని సినిమాలు వ‌చ్చినా, వీటిని రీప్లేస్ చేయ‌లేం. 
 
ప్ర‌తి విష‌యంలో ఈ సినిమ పరంగా బెస్ట్‌గానే జ‌రిగింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ప‌నిచేయ‌డం నా కోరిక‌. లేట్‌గా జ‌రిగినా లేటెస్ట్‌గా ది బెస్ట్‌గా జ‌రిగింది.
 
అది వెంకీమామ ప‌క్క‌న చేయ‌డం. ప్రేమమ్‌లో ఒక సీన్‌లో చేసేట‌ప్పుడే చాలా ఎగ్జ‌యిట్ అయ్యి చేశాను. ఈ సినిమాలో ప్ర‌తి సీన్‌లో ఎగ్జ‌యిట్‌గా చేశాను. చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్ చేశాను. బాబీ ఓ మిల‌ట‌రీ ఎపిసోడ్‌లో న‌న్ను కొత్త చూపించాడు.. ఈ సంద‌ర్భంగా త‌న‌కు థ్యాంక్స్‌. విశ్వ‌ప్ర‌సాద్‌గారికి థ్యాంక్స్‌. రాశీతో క‌లిసి భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని సినిమాలు చేస్తాను“ అన్నారు.