శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 డిశెంబరు 2019 (15:11 IST)

ఎట్ట‌కేల‌కు వెంకీమామ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు.
 
అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తాజాగా ఇప్పుడు వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా ద‌గ్గుబాటి, డైరెక్ట‌ర్ బాబీ ఓ ఫ‌న్నీ వీడియో కూడా విడుద‌ల చేశారు.
 
భారీ ఎత్తున సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన సినిమా పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్ వీడియోల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.