ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:35 IST)

గుంటూరులో దారుణం... నగ్నంగా పరిగెత్తిన మహిళ.. కామాంధుల చెర నుంచి

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే కొద్ది దూరం పరిగెత్తినట్టు సమాచారం. మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలుస్తోంది.
 
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నారని, అందుకే, ఈ కేసును గోప్యంగా పోలీసులు విచారణ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.