1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Massive Fire Destroys Resort In Dominican Republic

లగ్జరీ రిసార్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. పర్యాటకుడు మృతి... ఎక్కడ?

Beach Resort
Beach Resort
డొమినికన్ రిపబ్లిక్‌లోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌ను శుక్రవారం భారీ అగ్నిప్రమాదం ఏర్పడింది. ఈ ఘటనలో దాదాపు పూర్తిగా ధ్వంసం చేసింది. దీనివల్ల సుమారు 1,700 మంది పర్యాటకులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 
 
ఈ ప్రమాదంలో ఒక ఇటాలియన్ పర్యాటకుడు మరణించారని, మరికొందరు పర్యాటకులకు గాయాల కారణంగా వైద్య సహాయం అవసరమైందని అధికారులు తెలిపారు. వివా డొమినికస్ బీచ్ బై విండ్‌హామ్ అనే ఈ రిసార్ట్, డొమినికన్ రిపబ్లిక్ ఆగ్నేయ తీరంలోని బయాహిబే వద్ద ఉంది. 
 
ఇది అమెరికా- అంతర్జాతీయ పర్యాటకులకు ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. అయితే ఈ రిసార్టులో భారీ అగ్నిప్రమాదం కారణంగా సుమారు 1,690 మంది పర్యాటకులను ఇతర హోటళ్లు, సమీపంలోని వసతి గృహాలకు తరలించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. 
 
అయితే, గాలి ఉధృతి, రిసార్ట్ పైకప్పులో కొంత భాగం గడ్డితో నిర్మితమై ఉండటం వల్ల "మంటలు వేగంగా వ్యాపించినట్లు కనిపిస్తోందని దేశంలోని అత్యవసర కార్యకలాపాల కేంద్రం పేర్కొంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. తెలంగాణలో 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభం