ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (17:54 IST)

కూతురినే కాదు... అత్తను కూడా గర్భవతి చేశాడు..

వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అక్రమ సంబంధాలు వయోబేధం లేకుండా ముదిరిపోతున్నాయి. తాజాగా మెక్సికోలో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోకు చెందిన లారెన్ అనే అమ్మాయి పాల్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది.

అలా ఆ యువతి పెళ్లి కాకుండానే పాల్‌తో శారీరక సంబంధం కారణంగా గర్భం ధరించింది. కూతురు గర్భవతి కావడంతో తల్లికి ఇష్టం లేకపోయినా వారిద్దరి వివాహం జరిగింది. 
 
ఈ క్రమంలోనే అల్లుడి అందంపై మనసు పడ్డ లారెన్ అమ్మ జూలీ అల్లుడికి దగ్గరైంది. వీరిద్దరి మధ్య సంబంధం వివాహేతర సంబంధం ఏర్పడింది. కూతురు కంట పడకుండా అత్తా, అల్లుడు వీలున్నప్పుడల్లా రాసలీలలు కొనసాగిస్తూ వచ్చారు. ఓ రోజు భర్త ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన కూతురు లారెన్‌కు మైండ్ బ్లాక్ అయ్యింది.
 
తన తల్లి భర్త కలిసి చేస్తోన్న రాసలీలల చాటింగ్ చూసిన ఆమె ఇద్దరిని నిలదీయడంతో వీరి బాగోతం బయట పడింది. ఈ నేపథ్యంలోనే మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అల్లుడితో ఉన్న సంబంధంతో అత్త గర్భవతి అయిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.