శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (11:59 IST)

తమ్ముడిని బావిలోకి తోసి... యువతిపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడితో కలిసి బెకుపై వెళుతున్న ఓ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అడ్డుకున్న బాధితురాలి సోదరుడుని బావిలోకి తోసేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
 
ఈ ఘటన రాష్ట్రంలోని బేతుల్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన 18 యేళ్ల యువతి తన సోదరుడితో కలిసి మరో గ్రామానికి బయలుదేరింది. ఈ విషయాన్ని గమనించిన ఏడుగురు యువకులు వారి వెంటపడి గ్రామ శివారు ప్రాంతంలో అడ్డుకున్నారు. 
 
ఆ తర్వాత ఏడుగురు కామాంధులు కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని అడ్డుకోబోయిన యువతి సోదరుడిని బావిలోకితోసి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి వెళ్లిన అనంతరం తన సోదరుడిని బావి నుంచి బయటకు తీసి గ్రామానికి చేరుకుంది. 
 
అనంతరం కుటుంబ సభ్యుల సహాకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులోని నిందితులు శుభం బెలే(22), సందీప్‌ ఖాటియా(23), ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మిగితా ఇద్దరు నిందితులు దేవాస్‌ జిల్లాకు చెందిన లోకేశ్‌ సోని(22),యువతి గ్రామానికి చెందిన పవన్‌ బేలే(23)లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.