శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:30 IST)

అమ్మాయిల రంకుబాగోతాన్ని బయటపెడుతున్న కరోనా వైరస్!

కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలులేకుండా పోయింది. అయితే, ఈ లాక్‌డౌన్ వల్ల ప్రేమికులు, అక్రమ సబంధాలు పెట్టుకున్న స్త్రీపురుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ భాగస్వామిని లేదా ప్రియురాలిని కలుసుకోలేక విరహ వేదన చెందుతున్నారు. అప్పటికీ కొందరు అమ్మాయిలు ఉండబట్టలేకు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను కలుస్తున్నారు. అలాగే, పలువురు మహిళలు, భర్తలు లేని సమయంలో తమ రంకుమొగుళ్లను ఇంటికి పిలిచి పడక సుఖం పొందుతున్నారు. 
 
ఇలాంటి వారిని కరోనా వైరస్ పట్టిస్తోంది. ఇలాంటి వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వారిని అధికారులు ఆరా తీస్తున్నారు. ఫలితంగా వారు అసలు విషయాన్ని వెల్లడించాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. తాజాగా భోపాల్‌లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. 
 
భోపాల్ నగరానికి చెందిన ఓ యువతికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె వద్ద అధికారులు ఆరా తీశారు. ప్రైమరీ కాంటాక్టు వివరాలను సేకరించారు. ఈ విచారణలో తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్టు వెల్లడించింది. దీంతో అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయం అప్పటిదాకా తెలియని ఆ యువతి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. 
 
అలాగే, భోపాల్‌ పట్టణానికే చెందిన మరో యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని ప్రైమరీ కాంటాక్టుల వివరాలు అడగ్గా గర్ల్‌ఫ్రెండ్‌ విషయం చెప్పాడు. ఇప్పుడు షాకవడం పోలీసుల వంతయ్యింది. ఎందుకంటే ఆ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు ముందుగా మరో బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన యువతి, ఆ యువతి ఒక్కతేనని తెలిసింది. అంటే ఒకే యువతి ఒకరికి తెలియకుండా ఒకరిని ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌ను మెయింటెన్‌ చేస్తున్నట్టు కరోనా పుణ్యమాని వెలుగుచూసింది. 
 
ఇక బెంగళూరులో ఇలాంటిదే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఫార్మసీలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించి, అతని కొలీగ్స్‌, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరిలో నెగెటివ్‌ వచ్చింది. మరి అతనికి కరోనా ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. వెంటనే ఆమెను గుర్తించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 
 
ఈ రెండు ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. కరోనా వల్ల నిత్యం ఇలాంటి అక్రమ సంబంధాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారి విస్తరణ మొదలైన తర్వాత కూడా తమ అక్రమ సంబంధాలను కొనసాగించిన వారు మాత్రమే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. కానీ, దేశంలో కరోనా కాలుమోపక ముందు నుంచే తమ సంబంధాలకు బ్రేక్‌ ఇచ్చిన వారు మాత్రం బతికిపోయారు.