మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:34 IST)

ఫేస్‌బుక్‌లో ఛాటింగ్.. పెళ్లి వద్దన్న పాపానికి..?

ఫేస్‌బుక్ స్నేహం కొంపముంచింది. ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థి.. యువతిని మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల ఓ విద్యార్థి ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. రోజూ చాటింగ్ చేస్తూండటంతో స్నేహం ముందిరింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. 
 
అయితే ఆమె వివాహానికి అడ్డు చెప్పింది. అంతే దాంతో అక్కసు పెంచుకున్నాడు. అతనితో ఆమె మాట్లాడటం మానివేయడంతో.. ఆమె వాట్సాప్ నెంబర్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లను పంపుతూ వేధించడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేస్తానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేసి పోలీసులు.. అచ్చంపేట నివాసి గవిని సంజయ్ రాజుగా గుర్తించారు. రాజుపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఐపీసీలోని 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. ఎల్బీ నగర్ ఖాకీలు అరెస్ట్ చేశారు.