శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:18 IST)

భార్యకు కరోనా.. భర్త ఆత్మహత్య ఎక్కడంటే?

భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుర్గావ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లోని ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో దగ్గరలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆమెను చేర్పించారు. వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించి ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. 
 
తన భార్యకు కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఆమె 54 ఏళ్ల భర్త సత్బీర్ సింగ్ అదే రోజు రాత్రి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్ర లేచిన కొడుకు ఎక్కడా తండ్రి కనిపించకపోవడంతో అతడి బెడ్‌రూంకు వెళ్లాడు. అక్కడ తండ్రి నిర్జీవంగా ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో షాక్‌కు గురయ్యాడు. 
 
వెంటనే పోలీసులకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పడంతో అక్కడకు చేరుకున్న వారు సత్‌బీర్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో.. ఐపీసీ సెక్షన్ 174 కింద విచారణ చేపట్టామని తెలిపారు.