1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Narendra Modi Addresses US Congress

అమెరికా చట్టసభల్లో ప్రధాని మోదీ ప్రసంగం... మిన్నంటిన కరతాళ ధ్వనులు...(ఫోటోలు)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చట్టసభలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు. తన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తూ... తొరోస్ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ మా రాజకీయ తత్వాన్ని మార్చిందనీ, స్వామి వివేకానంద చికాగో ప్రసం

PM narendramodi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా చట్టసభలనుద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగానికి సభ్యులు కరతాళ ధ్వనులు చేశారు. తన ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తూ... తొరోస్ ప్రతిపాదించిన సహాయ నిరాకరణ మా రాజకీయ తత్వాన్ని మార్చిందనీ, స్వామి వివేకానంద చికాగో ప్రసంగం, భారతీయ సంస్కృతి, ఉన్నతిని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతం మార్టిన్ లూథర్ కింగ్ పైన ప్రభావితం చేసిందని చెపుతున్నప్పుడు సభ్యులంతా లేచి కరతాళ ధ్వనులు చేశారు.
 
ఇంకా అంబేద్కర్ జీవితాన్ని మలుపు తిప్పింది కొలంబియా యూనివర్శిటీలో చదువేనని చెప్పారు. ఇంకా అమెరికాలోని ఎంతోమంది త్యాగాల ఫలితంగానే అమెరికా తలెత్తుకుని ప్రపంచంలో తిరుగుతోందన్నారు. మానవజాతి శాంతియుత జీవితానికి అమెరికా చేసిన సేవ వెలకట్టలేనిదన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ రెండు దేశారను ఒకతాటిపై నడిపిస్తుందని చెప్పారు.
 
భారత్-అమెరికా బంధం ఉన్నత శిఖరాలకు చేరిందని చెప్పిన ప్రధాని భారత్ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా అందించిన సాయం ఎన్నటికీ మరచిపోదన్నారు. భారతదేశం నుంచి ఎంతోమంది యువత నేడు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఇంకా భారతీయ యోగా సంప్రదాయాన్ని అమెరికాలో 30 మిలియన్ల అభ్యసిస్తున్నారని చెప్పిన మోదీ యోగా మీద మేథోహక్కులను కోరుకోవడం లేదని చెప్పినప్పుడు సభ్యులు పెద్దపెట్టున కరతాళధ్వనులు చేశారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
చెట్ల కింద-పుట్ల కింద కార్లను వదిలేసి పారిపోతున్న చైనా ఓనర్స్.. ఎందుకో తెలుసా?