సంబంధిత వార్తలు
- లైవ్ మర్డర్... తల్లిని, చెల్లిని చెరిచి చంపేస్తానన్నాడు.. అందుకే చంపేశా
- ప్రియురాలిని లైంగికంగా వేధించిన బాస్... ప్రియుడు ఆమె ఫోన్ చూసి...
- కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు
- ప్రియుడితో భార్య కలుస్తోందని ఊహించుకున్న భర్త.. ఏం చేశాడంటే..?
- భర్త ప్రియురాలితో ఏకాంతంగా ఉండడాన్ని చూసిన భార్య... ఏం చేసిందంటే..!
అనుభవించి పొత్తికడుపులో ఓ పంచ్.. ఆపై గొంతు నులిమి హత్య... అమెరికాలో సీరియల్ కిల్లర్
అతనో సీరియల్ కిల్లర్. అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఏకంగా 90 మందిని అనుభవించి హత్య చేశాడు. నైట్ క్లబ్బులు, పబ్బులు, బార్లలో ఒంటరిగా కనిపించే మహిళలను శ్యామ్యూల్ డ్రగ్స్ పేరుతో ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా కలిసి ఆ తర్వాత అక్కడే గొంతు నులిమి హత్య చేస్తుంటాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రస్తుతం టెక్సాస్ జైలులో 78 యేళ్ళ వృద్ధుడు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈయన 1980-84 మధ్య కాలంలో ముగ్గురు మహిళల అత్యాచారం, హత్య కేసుల్లో అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు మరింతగా లోతుగా ఆయన వద్ద విచారణ జరుపగా అతనిలో ఓ నరరూప రాక్షసుడున్నాడన్న విషయం బయటపడింది. దీంతో దర్యాప్తు అధికారులే నివ్వెర పోయారు.
పైగా, ఇతను ఓ బాక్సర్. మత్తుమంది ఇచ్చి అనుభవిస్తాడు. ఆ తర్వాత హత్య చేసేందుకు ముందు వారిపై ముష్టిఘాతాలు కురిపిస్తాడు. 1982లో 20 యేళ్ళ యువతిని చంపడానికి ముందు పొత్తికడుపులో ఇచ్చిన ఓ పంచ్‌కు ఆ యువతి వెన్నుపూక విరిగిపోయింది. ఈ నరరూపరాక్షసుడి హత్యాకాండ 1980 నుంచి 1990 వరకు కొనసాగింది. దేవుడు, పాపం, శిక్షలు అంటే భయం లేకపోవడంతో శ్యామ్యూల్ లిటిల్ ఈ తరహా నేరాలకు పాల్పడినట్టు అధికారుల విచారణలో తేలింది.
