శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (08:32 IST)

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు

నీకు పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇపుడు నా కుమార్తెతో సహజీవనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ప్రాధేయపడిన ఓ గిరిజనుడుని మరో ఆదివాసి నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రేగడిపాలెం అనే గ్రామానికి చెందిన నరాకోట ఆదిరెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. ఈమెతో అదే మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిరెడ్డి.. దొరబాబును హెచ్చరించాడు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
పెళ్ళై పిల్లలు ఉన్నవాడివి, తన కుమార్తెను వదిలిపెట్టాలని కోరాడు. ఈ మాటలకు కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.