సంబంధిత వార్తలు
- మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు
- పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?
- "2.O" మూవీలో పక్షిరాజు పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా?
- గీతా బస్రా ఫోటోను తొలుత యువరాజ్ సింగ్‌కు చూపించా-భజ్జీ
- 'సర్దార్' పాదాల చెంత ఉన్నది.. పిట్టా.. రెట్టా : కన్నడ నటి దివ్య కామెంట్స్
టీవీ యాంటీనాపై కొండచిలువ.. నోటివద్ద పక్షి.. పైథాన్ పాట్లు చూడతరమా? (Video)
కొండచిలువ (పైథాన్).. దీని చూస్తేనే వళ్లు జలదరించిపోతుంది. పైగా, ఇది మనుషులు, జంతువులు, పక్షులు.. ఇలా దేన్నైనా మింగేస్తుందన్న పేరుంది. తన నోటికి ఏది దొరికినా దాన్ని వదలకుండా మింగేయగలదు. ఇందుకోసం ఎన్నో సాహసాలూ చేస్తుంది. ఒక్కోసారి తన కంటే పెద్ద జంతువులను కూడా మింగేందుకు ప్రయత్నిస్తుంది.
తాజాగా ఓ కొండచిలువ కూడా ఇలాగే ఓ పక్షిని మింగేయబోయింది. పక్షి చూస్తే కాస్త పెద్దగానే ఉంది. అది తన నోటికి చిక్కడంలేదు. ఓ ఇంటిపైన ఉన్న టీవీ యాంటీనా మీద ఉన్న ఆ పక్షిని ఏదో విధంగా పట్టేసి చంపేసింది. కానీ, దాన్ని మింగడానికి తెగ ఆయాస పడింది. అదిదాన్ని మింగడం కోసం పడుతున్న పాట్లు చూసిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
