బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (17:05 IST)

గీతా బస్రా ఫోటోను తొలుత యువరాజ్ సింగ్‌కు చూపించా-భజ్జీ

గీతా బస్రా ఫోటోను తొలుత యువరాజ్ సింగ్‌కు చూపించానని.. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. యువీకి గీత ఫోటోను చూపించి.. ఎవరో తెలుసా అని అడిగాను. అతను తెలియదని చెప్పాడు. వివరాలు కనుక్కోమని యువీకి చెప్పానని భజ్జీ తన ప్రేమకథను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 
 
సినిమా పోస్టర్‌లో చూసి గీతా బస్రాను ప్రేమించానని.. సువేద్ లోహియా అనే కామన్ ఫ్రెండ్ ద్వారా గీతను తొలిసారి కలిశానని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచి మ్యాచ్ ముగిశాక ముంబై వచ్చామని.. గీతకు ఫోన్ చేసి కాఫీ షాపులో కలుద్దామని చెప్పినా ఆమె పట్టించుకోలేదని భజ్జీ చెప్పాడు. 
 
కానీ ఐపీఎల్ టిక్కెట్స్ కోసం తనకు గీత ఫోన్ చేసిందని.. ఆమె డ్రైవర్ కోసం ఆ టిక్కెట్లు తీసిచ్చినట్లు హర్భజన్ తెలిపాడు. ఆ తర్వాతే కాఫీ షాప్‌కు రమ్మంటే వచ్చేందుకు ఒప్పుకుందని.. అలా కొన్ని రోజుల పాటు తరచూ కలుసుకుంటూ వుండేవాళ్లమని.. పెళ్లి గురించి ఓసారి అడిగితే కెరీర్ ముఖ్యమని చెప్పిందని.. ఆపై 9 నెలల తర్వాత పెళ్లికి ఒప్పుకుందని భజ్జీ తెలిపాడు.