బుధవారం, 6 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (10:25 IST)

కోచ్ కోర్కె తీర్చమన్నాడు.. నేనూ వేధింపులకు గురయ్యా : మిథాలీ రాజ్

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మౌనంవీడారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో తాను ఎదుర్కొన్న అవమానాలు, వేధింపులపై నోరు తెరిచారు. ముఖ్యంగా, కోచ్ కోర్కె తీర్చమన్నాడంటూ బాంబు పేల్చింది. పైగా, తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు ప్రటించింది. 
 
ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ ట్వంటీ20 కప్ టోర్నీ ఆడుతోంది. ఈ జట్టులో మిథాలీ రాజ్ ఉండగా, సెమీస్ మ్యాచ్‌లో ఆమెను తప్పించారు. జట్టుకు కెప్టెన్‌గా హర్మీత్ సింగ్ కౌర్‌ను నియమించారు. అయితే, జట్టు నుంచి మిథాలీ రాజ్‌ను తొలగించడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తనను సెమీస్‌లో పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ బీసీసీఐకు ఒక లేఖ రాసింది. అందులో అనేక సంచలన విషయాలను వెల్లడించింది. జట్టు కోచ్ రమేశ్ పొవార్ తనని మానసికంగా వేధించాడని ఆరోపించారు. అలాగే, సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు, మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీపై కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. 
 
నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసి, తన కెరీర్‌ని నాశనం చేయాలని కోచ్ రమేష్ పొవార్ చూస్తున్నారని పేర్కొంది. నెట్‌లో ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడే నిలబడి వారి ఆటతీరును పరిశీలించే కోచ్.. తను ప్రాక్టీస్ చేసే సమయంలో మాత్రం అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయేవాడని పేర్కొంది. 
 
ఏదేనీ మాట్లాడలని చూస్తే పక్కకు వెళ్లడం లేదా, ఫోన్ చూసుకుంటూ ఉండిపోవడం వంటి చేష్టలకు పాల్పడుతూ తనను ఓ అంటరాని మనిషిగా చూస్తున్నాడనీ, ఇలాంటివన్ని తనకు చాలా ఇబ్బంది అనిపించాయని తెలిపింది. ఇలాంటి వేధింపులు గత కొన్ని రోజులుగా సాగుతున్నా తాను మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆటపైనే మనసు కేంద్రీకరించానని తాను రాసిల లేఖలో వివరించింది.