సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (12:23 IST)

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..

మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసింది. 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ (2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) రికార్డు సృష్టించి... అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. 
 
మరోవైపు తాజా రికార్డుతో పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును మిథాలీ అధిగమించినట్లయింది. రోహిత్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ (2,102 పరుగులతో) భారత్‌ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు.
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం ఐర్లాండ్‌ జట్టుతో తలపడనుంది.