గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (16:04 IST)

సురేష్ రైనా కుమార్తె బర్త్ డే వేడుకలో ధోనీ సందడి.. (వీడియో)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్ రైనా కుమార్తె గ్రేసియా బర్త్ డే వేడుకను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్ రైనా కుమార్తె గ్రేసియా బర్త్ డే వేడుకను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, బ్రావో సీఎస్‌కే క్రీడాకారులు పాల్గొని సందడి చేశారు. చెన్నై జట్టు ఈ నెల 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్‌ ఢిల్లీ చేరుకున్నారు. 
 
ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భజ్జీ తన భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమార్తె యాక్టింగ్‌లో అదరగొట్టేస్తుందని.. అప్పుడే 20 ఏళ్ల యువతి తరహాలో యాక్ట్ చేస్తుందంటూ కామెంట్ చేశాడు.