గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (13:26 IST)

రిటైర్మెంట్‌పై ఇక ఆలోచించాలేమో.. మిథాలీ రాజ్

మహిళల ట్వంటీ-20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంతో  కెప్టెన్ హర్మన్ ప్రీత్, టీమ్ యాజమాన్యంపై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై మిథాలీ రాజ్ స్పందించారు.


తనను జట్టు కోచ్ రమేష్ పవార్ అవమానించారంటూ.. క్రికెట్ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ తన కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు మిథాలీ రాజ్ ఓ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు. 
 
ఆ లేఖలో రెండు దశాబ్దాల తన కెరీర్‌లో తొలిసారి కుంగిపోయానని చెప్పింది. ఆత్మవిశ్వాసం కోల్పోయని, ఏదో పోగొట్టుకున్నట్లు అనిపించింది. రిటైర్మెంట్‌పై ఇక ఆలోచించాలేమోనని మిథాలీ రాజ్ తెలిపింది.

అధికారంలో వున్న కొందరు తన కెరీర్‌ను నాశనం చేయాలని.. తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. డయానా ఎడుల్జీ పట్ల విశ్వాసం, గౌరవం ఇచ్చినా.. ఆమె అధికారాన్ని తన వ్యవహారంలో దుర్వినియోగం చేశారని.. హర్మన్ ప్రీత్‌పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పింది. 
 
తన దేశానికి ప్రపంచ కప్ అందించాలనుకున్నా. కానీ కుదరలేదు. ఇక టీమ్ కోచ్ రమేష్ పొవార్ తనను మానసికంగా వేధించారు. నెట్స్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తున్నా.. స్థిరంగా నిలబడి వారి ఆటను పరిశీలిస్తూ... సలహాలు చేసేవారు. తన బ్యాటింగ్ చేస్తుంటే.. అక్కడ వుండకుండా పక్కకి వెళ్లిపోయేవారు. గత కొద్దిరోజులుగా తనను అవమానించారని.. కానీ సహనం కోల్పోకుండా ప్రశాంతంగానే వున్నానని మిథాలీ రాజ్ వెల్లడించింది.