1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. The eggs, which exploded like bombs, woman injured

బాంబుల్లా బ్లాస్ట్ అయిన కోడిగుడ్లు, మహిళ ముఖం చిట్లింది

eggs
సాధారణంగా కోడిగుడ్డు ఉడికించేటప్పుడు స్వల్పంగా పగలడం సహజం. కానీ కొడ్లు పేలడం ఎక్కడైనా చూశారా. ఇక్కడ అదే జరిగింది. ఒక మహిళ గుడ్లను ఉడికించింది. అవి ఉడికి వుంటాయిలే అని బయటకు తీయబోతే అవి బాంబుల్లా బ్లాస్ట్ అయ్యాయట. అదెలా అంటే ఇంగ్లాండ్ లోని చాండే అనే మహిళ కోడిగుడ్లను ఉడకబెట్టేందుకు మైక్రో ఓవెన్‌ను ఉపయోగిస్తోంది.
 
సులభంగా, త్వరగా గుడ్లు ఉడుకుతాయని భావించిన ఆమె కొన్నాళ్ళుగా ఈ పద్ధతినే పాటిస్తోంది. అయితే ఇటీవల ఆమెకు ఊహించని అనుభవం ఎదురైందట. మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికించిన గుడ్లు ఒక్కసారి బాంబుల్లా పేలాయట. దీంతో ఒక్కసారిగా ఆమె ముఖం, మెడ మొత్తం తీవ్ర గాయాలయ్యాయట.
 
ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గుడ్లను పొరబాటున కూడా ఓవెన్లో పెట్టి ఉడికించకూడదట. అలా చేస్తే పేలుడు జరిగే అవకాశాలున్నాయట. ఈ విషయం తెలియక చాలామంది మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి గుడ్లను ఉడికిస్తుంటారు.
About Writer
జె
తర్వాతి కథనం
ఆంధ్రాకు కరోనా వైరస్ గుబులు.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు