సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (22:08 IST)

కోడిగుడ్లు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

చెడు కొవ్వు.. బ్యాడ్ కొలెస్ట్రాల్. దీనితోనే ఇప్పుడు వస్తున్న ఇబ్బంది అంతా. ఇదివరకు ఎలాంటి కొవ్వైనా సరే భౌతకమైన శ్రమ వుండటంతో కరిగిపోయేది. కానీ ఇప్పుడలా కాదు. గంటలకొద్దీ కుర్చీల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలు. దీనితో విపరీతంగా కొవ్వు పేరుకుపోతోంది. అందువల్ల తినే ఆహార పదార్థాల్లో చెడు కొవ్వు వేటిలో ఎంతెంత వుందనేది చూసుకోవాల్సి వస్తుంది.
 
కోడిగుడ్డు విషయానికి వస్తే... ఆరోగ్యకరమైన వ్యక్తులకు రోజుకు 3 గుడ్లు సంపూర్ణంగా సురక్షితం అని సైన్స్ స్పష్టం చేసింది. గుడ్లు స్థిరంగా HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. 70% మంది విషయంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుదల లేదు. ఐతే 30 శాతం మందిలో LDL... అంటే చెడు కొలెస్ట్రాల్ కాస్త చేరినట్లు తేలింది. దీనికి ఖచ్చితంగా కోడిగుడ్డు అని చెప్పలేదు.
 
ఇకపోతే గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటుంది. అయితే, మధుమేహం (ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్) ఉన్నవారిలోనూ గుడ్డు వల్ల గుండెజబ్బుల ముప్పు తగ్గినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
 
గుడ్డు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై వీరు అధ్యయనం చేశారు. వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని గుర్తించారు. మూడు నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇటువంటి ఫలితాలే వెల్లడి కావడంతో పరిశోధనను పొడిగించారు. 
 
పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి 12 గుడ్లు, కనిష్ఠంగా వారానికి 2 కంటే తక్కువ గుడ్లు తినాలని సూచించారు. మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్నవారిని మూడు గ్రూపులుగా విభజించారు. మూడునెలలపాటు వీరికి గుడ్లు అందించారు. మొదటి గ్రూపు వారికి గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. 
 
రెండో గ్రూపువారికి బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇక చివరి గ్రూపువారికి మిగతా ఆరునెలలు నుంచి పన్నెండు నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినాలని సూచించారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గుడ్డు తినడం వల్ల కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలకు ఎంతో మేలు కలుగుతుందని వారంటున్నారు. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.