1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. A 25-year-old transformer exploded in Simhachalam

సింహాచలంలో 25 ఏళ్ల కిందటి పాత ట్రాన్స్‌ఫార్మర్ పేలింది

25-year-old transformer
సింహాచలంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ట్రాన్స్ కో సబ్ స్టేషన్లోని 10/6 ట్రాన్స్ ఫార్మర్ అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో వున్న ప్రజలు భయభ్రాంతులకు లోనై ఇళ్ల బయటకు పరుగులు తీసారు.
 
కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌ఫార్మర్ 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన పాతదిగా అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఒక భార్య ఇద్దరు ప్రియులు, కరోనా చంపేసిందని భర్తను హత్య చేసేసింది