ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ.. కారణం అదేనట..
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వీలుగా దాదాపు 700 మందికి ఉద్వాసన పలకనున్నట్లు బుధవారం డిస్నీ తెలిపింది.
సీఈఓ బాబ్ ఐగర్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీకి చెందిన 2021 వార్షిక నివేది ప్రకారం డిస్నీలో 1,90,000 మంది పనిచేశారు. వీరిలో 80 శాతం మంది పూర్తి స్థాయి ఉద్యోగులు.
ఈ నేపథ్యంలో 2023లో డిస్నీ ఉద్యోగుల తొలగింపులకు సంస్థ ప్రకటన చేసింది. తమ స్ట్రీమింగ్ సేవలకు తొలిసారి చందాదారులు తగ్గారని పేర్కొంది.
ఇందుకు అనుగుణంగానే ఉద్యోగులను తొలగించాలని డిస్నీ డిసైడ్ చేసింది. అలాగే భారీగా పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.