1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Google Pixel 5 spotted on AI Benchmark with Snapdragon 765G

చౌకధరలో వస్తోన్న గూగుల్ పిక్సెల్ 5 బెంచ్ మార్కింగ్

Google Pixel 5
Google Pixel 5
గూగుల్ పిక్సెల్ 5ఏఐ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ వెబ్‌సైట్లో ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ అక్టోబర్‌లో లాంచ్ కానుందని టాక్ వస్తోంది. ఈ వెబ్ సైట్లో దీని పేరును గూగుల్ పిక్సెల్ 5గా పేర్కొన్నారు. అలాగే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌తో ఇది కనిపించింది. అయితే ఈ ప్రాసెసర్‌ను బట్టి చూస్తే ఈ ఫోన్ ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది. 
 
వన్ ప్లస్ నార్డ్‌లో కూడా ఇదే ప్రాసెసర్‌నే అందించారు. గతంలో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 4, గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్ఎల్‌ల్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ స్కోర్ 39.4గా ఉండటం విశేషం. 
 
గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 5 ఎక్స్ఎల్ ల్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ 4జీ వేరియంట్ మనదేశంలో అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ.26వేలకు పైబడి వుంటుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
యూపీఎస్సీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల