బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (09:40 IST)

నోకియా 5310 మొబైల్.. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లోనూ..

Nokia 5310
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా 5310 మొబైల్ భారత్‌లో ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోనుకు సంబంధించి సేల్ ఆన్‌లైన్‌లో మాత్రమే జరిగింది. ఇప్పుడు దీన్ని ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి నోకియా తీసుకువచ్చింది. గతంలో లాంచ్ అయిన నోకియా 5310 ఎక్స్ ప్రెస్ మ్యూజిక్‌కు అప్ గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.3,399గా నిర్ణయించారు. 
 
బ్లాక్/రెడ్, వైట్/రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పటివరకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ లైన్ స్టోర్లలోకి కూడా నోకియా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లేను అందించారు. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్, ఫిజికల్ కీప్యాడ్ లు ఫోన్ ముందుభాగంలో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉంది. 
 
ఫీచర్లు..
ఫోన్ వెనకభాగంలో వీజీఏ కెమెరా, 
ఎల్ఈడీ ఫ్లాష్‌
మీడియాటెక్ ఎంటీ6260ఏ ప్రాసెసర్ 
8 ఎంబీ ర్యామ్, 
16 ఎంబీ స్టోరేజ్‌
 
మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. 
నోకియా సిరీస్ 30+ సాఫ్ట్ వేర్ ఇందులో అందుబాటులో ఉంది. 
 
బ్లూటూత్ వీ3.0, మైక్రో యూఎస్ బీ పోర్టు, 
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌‌
వైర్ లెస్ ఎఫ్ఎం సపోర్ట్
 
ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే 20 గంటల టాక్ టైం, 
22 గంటల స్టాండ్ బై టైం లభిస్తుంది. 
దీని బరువు 88.2 గ్రాములుగా ఉంది.