సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 జూన్ 2020 (16:58 IST)

నోకియా 5310 పేరిట కొత్త ఫోన్.. ధర రూ.3,999

Nokia 5310
కొత్త ఫీచర్‌తో కూడిన నోకియా 5310 పేరిట కొత్త ఫోనును హెచ్ఎండీ గ్లోబల్ విడుదల చేసింది. ఇందులో స్లాట్‌, ఎఫ్ఎం రేడియో, ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఎంపీ 3 ప్లేయర్, మైక్రో ఎస్డీ కార్డు వేసుకునే స్లాట్, వంటివి వున్నాయి. 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్.. 2జి, బ్లూటూత్ 3.9, మైక్రో యూఎస్‌బీని కలిగివుంటుంది. 
 
నోకియా 5310 మొబైల్ ఫోన్ వైట్ విత్ రెడ్‌, బ్లాక్ విత్ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో వుంది. రూ.3,999 ధరకు ఈ ఫోన్‌ను అమేజాన్‌లో జూన్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందుకు గాను ప్రీ-బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించారు.
 
నోకియా 5310 స్పెసిఫికేషన్లు…
* సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌, వీజీఏ బ్యాక్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు
* 1200 ఎంఏహెచ్ బ్యాటరీ, 22 రోజుల వరకు బ్యాటరీ స్టాండ్ బై
 
* 2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఎంటీ6260ఏ ప్రాసెసర్‌, 8ఎంబీ ర్యామ్‌, 16 ఎంబీ స్టోరేజ్‌.