శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 జూన్ 2020 (14:57 IST)

కరోనాతో ప్రపంచం బిక్కుబిక్కు, కానీ చైనా మాత్రం మట్టి కోసం సరిహద్దు దాటి...

ప్రపంచం ఇప్పుడు కరోనావైరస్ తో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. కానీ చైనాకు మాత్రం పొరుగునే వున్న భారతదేశ సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకువచ్చేందుకు ఇదే అదనని కలలు కంటోంది. ఈ క్రమంలో సరిహద్దు దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు యత్నించింది. దీనితో ఇరు పక్షాల మధ్య ఘర్షణ తలెత్తింది.
 
నిరంతర ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఒక భారతీయ అధికారితో సహా ఇద్దరు సైనికులు అమరవీరులయ్యారు. గ్లోబల్ టైమ్స్ రిపోర్టర్ ప్రకారం, చైనాకు చెందిన ఐదుగురు చైనా సైనికులు మరణించారు. 11 మంది గాయపడ్డారు.
 
చైనాతో భారత సరిహద్దులో జరిగిన వివాదంలో 1975 తరువాత భారత సైనికులు మరణించడం ఇదే మొదటిసారి. అయితే, వాగ్వివాదంలో ముగ్గురు నుంచి నలుగురు సైనికులు మరణించారని భారత్ పేర్కొంది.
 
1975లో చైనా దాడి చేసింది: ఇరు దేశాల మధ్య చివరి కాల్పులు 1967లో జరిగాయి, కానీ 1975లో చైనా కూడా భారత సరిహద్దుపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో నలుగురు భారతీయ సైనికులు మరణించారు. ఆ సమయంలో చైనా సరిహద్దును ఉల్లంఘించిందని భారత ప్రభుత్వం చెప్పింది. కాని అప్పుడు కూడా చైనా ఈ విషయాన్ని అంగీకరించలేదు.
 
1967లో ఏమి జరిగింది: భారతదేశం మరియు చైనా మధ్య చివరి కాల్పులు 1967లో జరిగాయి. సిక్కిం ప్రాంతంలో జరిగిన ఈ హింసాత్మక ఘర్షణలో భారతదేశానికి చెందిన 80 మంది సైనికులు అమరవీరులయ్యారు. మరోవైపు, ఈ ఘర్షణలో సుమారు 400 మంది చైనా సైనికులు మరణించారు.