శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (11:34 IST)

దేశంలో మరో 11502 కరోనా కేసులు... మరణాల్లో 9వ స్థానం

దేశంలో కొవిడ్‌-19‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 325 మంది మరణించారు.
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో కరోనా మరణాల్లో 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,32,424 కేసులు నమోదు కాగా... 9520 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. 
 
అలాగే దేశవ్యాప్తంగా 1,53,106 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 1,69,798 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. 
 
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,502 కేసులు నమోదు కాగా... 325 మంది మృతి చెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 51 శాతానికి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 
 
మహారాష్ట్రలో అత్యధికంగా 1,07,958 కేసులు నమోదు కాగా...3950 మంది మృతి చెందారు. అలాగే తమిళనాడులో 44,661 కేసులు నమోదు అవగా 435 మంది మృతి చెందారు. 
 
ఢిల్లీలో 41,182 కేసులు నమోదు కాగా...1327 మంది మృతి చెందారు. అలాగే గుజరాత్‌లో 23,544 కేసులు నమోదు అవగా 1477 మంది మృత్యువాతపడ్డారు.