1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Poco M3 Pro 5G Launch Event Today: How to Watch Livestream, Expected Price, Specifications

పోకో ఎం3 ప్రో 5జీ.. త్వరలో భారత్‌లో విడుదల..

Poco M3 Pro 5G
poco 2
గ్లోబల్ మార్కెట్‌లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. పోకో నుంచి పోకో ఎం3 ప్రో 5జీ వచ్చేసింది. ఇటీవల కాలంలో వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలన్నీ 5జీ మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు పోకో ఎం3 ప్రో 5జీ రిలీజ్ అయింది. 
 
గ్లోబల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
 
18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 22.5 వాట్ ఛార్జల్ లభించడం విశేషం. పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది. 
 
పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 179 యూరోలు కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర 199 యూరోలు.
తర్వాతి కథనం
ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు: సీఎం జగన్