శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

బుధవారం (19-05-2021) రాశిఫలితాలు - సత్యదేవుని పూజిస్తే...

మేషం : స్త్రీలకు టీవీ కార్యక్రమాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కువడానికి బాగా కష్టపడాలి. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. తక్షణం అందిపుచ్చుకోవడం క్షేమదాయకం. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
వృషభం : పాతమిత్రుల కలయిక, దైవకార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సమస్యలు, కార్మికులతో వివాదాలు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశాల సందర్శనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. 
 
మిథునం : ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి విధి నిర్వహణలో ఏకాగ్రత వహించండి. ఫైనాన్స్, కాంట్రాక్టుదారులకు ఆశించినంత ఫలితములు లభించవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన క్లైయింలు ఆలస్యంగా అందుతాయి. 
 
కర్కాటకం : ఎగుమతి, దిగుమతులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తత చాలా అవసరం. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు. రాజకీయ నేతలకు ప్రయాణాలలో, సభా కార్యక్రమాలలోనూ మెళకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆదరణ లభిస్తుంది. 
 
సింహం : స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. దంపతుల మధ్య అకారణ కలహం పట్టింపులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి పనివారితో చికాకులు తప్పవు. స్త్రీలకు కొత్త పరిచయాల వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. 
 
కన్య : సంస్థల నుంచి పారితోషికం అందుతాయి. ఏసీ, ఏసీ కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాకయంగా ఉంటుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఊహంచని విధంగా ధనలాభం పొందుతారు. 
 
తుల : ఆర్థిక లావాదేవీలు, అనుకూలించవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు ఆకస్మికంగా మార్పులు సంభవిస్తాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహం తప్పదు. ఒక వ్యవహారంలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలు వాయిదావేస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాలు, ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : వృత్తి వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. సంఘంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. లౌక్యంగా వ్యవహరించి మీ సమాధానాన్ని దాటవేయండి. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. 
 
కుంభం : రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య కొత్త  కలహాలు తలెత్తుతాయి. ప్రముఖుల ప్రమేయంతో మీ సమస్య సానుకూలమవుతుంది. 
 
మీనం : వస్త్ర, కళంకారీ, పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చేకాలం. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.