1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio Prime Subscription Deadline May Be Extended by a Month

ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపని జియో వినియోగదారులు

దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదే

Reliance Jio
దేశీయ టెలికాం రంగంలోకి అడుగుపెట్టక ముందు నుంచే సంచలనాలు సృష్టిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంస్థకు చెందిన టెలికాం సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో జియో ఉచిత సేవలు మరో యేడాది పాటు పొందే నిమిత్తం జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ సభ్యత్వం కోసం రూ.99 చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు జియో వినియోగదారులు ముందుకు రావడం లేదు. 
 
దీంతో జియో ప్రైమ్ సభ్యత్వ గడువును మరో నెల పొడిగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో విఫలం కావడమే.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మధ్యప్రదేశ్‌లో దారుణం.. 70ఏళ్ల మహిళా పేషెంట్‌ను పీక్కుతిన్నాయి...!