1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp Update: WhatsApp Fixes Crucial Privacy Bug in iOS View Once Feature

WhatsApp Update: వాట్సాప్, iOS వినియోగదారులకు వ్యూ వన్స్ ఫీచర్.. కానీ?

whatsApp
సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా పరిగణించబడే వాట్సాప్, iOS వినియోగదారుల కోసం ఒక ముఖ్యమైన ఫీచర్ విడుదల అయ్యింది. ఈ అప్‌డేట్ దాని వ్యూ వన్స్ ఫీచర్‌లోని ఒక ప్రధాన గోప్యతా లోపాన్ని పరిష్కరిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియోలు లేదా వాయిస్ మెసేజ్‌లను పంపితే అవి అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా డిలీట్ అవుతాయి. ఇది వ్యక్తిగత ఫైల్స్, ప్రైవేట్ సమాచారం పంపించేందుకు అనేకమంది ఉపయోగిస్తారు. అయితే ఈ ఫీచర్‌లో ఓ పెద్ద లొసుగు ఉండటంతో యూజర్ల ప్రైవసీకి ప్రమాదం కలుగుతోంది. 
 
వ్యూ వన్స్ ఫీచర్‌లో పంపిన మీడియాను అవతలి వ్యక్తి ఒకసారి చూసిన తర్వాత అది తిరిగి కనిపించదు. కానీ ప్రస్తుతం ఐఫోన్‌లలో ఓ లొసుగును ఉపయోగించి వ్యూ వన్స్ మీడియాను మళ్లీ చూడగలిగే అవకాశం వుంది. ఈ లొసుగుతో ఈ ఫీచర్ ఉద్దేశం పూర్తిగా విఫలమవుతోంది. దీనిపై మెటా పని చేస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఈ సమస్యకు అప్డేట్ రాకముందు యూజర్లు జాగ్రత్తగా వుండాలి. వ్యక్తిగత సమాచారం లేదా రహస్యమైన కంటెంట్‌ను వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా పంపే ముందు దీనిపై ఆలోచించడం మంచిది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మార్చి 4న నథింగ్ 3a సీరీస్ విడుదల