అమ్మదొంగా! ఇంత రొమాంటిక్ ఎప్పుడయ్యావురా...?

ఈమధ్య కాలంలో పనుల్లో బిజీ అయిపోయి చాలామంది మతిమరుపులకు గురవుతున్నారు. ఆఫీసుల్లో పని ఒత్తిడితో ఇంట్లో చేయాల్సిన పనిని మరిచిపోతుంటారు. దీంతో భార్యలతో భర్తలకు చీవాట్లు తప్పడం లేదు. అలాంటిదే ఒకటి ఎదుర్కొన్నారు ఒక భర్త. ఈ జోక్ చదవండి మీకే అర్థమవుతుంది.

Love, romance
TJ| Last Modified గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:26 IST)
ఈమధ్య కాలంలో పనుల్లో బిజీ అయిపోయి చాలామంది మతిమరుపులకు గురవుతున్నారు. ఆఫీసుల్లో పని ఒత్తిడితో ఇంట్లో చేయాల్సిన పనిని మరిచిపోతుంటారు. దీంతో భార్యలతో భర్తలకు చీవాట్లు తప్పడం లేదు. అలాంటిదే ఒకటి ఎదుర్కొన్నారు ఒక భర్త. ఈ జోక్ చదవండి మీకే అర్థమవుతుంది.

ఒక భర్త, భార్య బర్త్‌డే నాడు మరచిపోతానని ముందే బుకే, స్వీట్లు అందేలా ఆన్‌లైన్లో డబ్బు కట్టాడు. ఆరోజు భార్య, భర్త తనకు హాపీ బర్త్ డే చెప్తాడా లేదా అని ఎదురు చూసింది. భర్త యధాప్రకారం మర్చిపోయి ఆఫీసుకు బయలుదేరాడు. భార్య ఉడికిపోయింది. కానీ భర్త అలా పోగానే ఇలా స్వీట్లు, పూలు వచ్చాయి. అమ్మదొంగా! ఇంత రొమాంటిక్ ఎప్పుడయ్యావురా అని మురిసిపోయింది. సాయంత్రం భర్త వచ్చేసరికి చక్కగా తయారై డ్రాయింగ్ రూములో పూలు అలంకరించి కూర్చుంది. ఈయన వచ్చి కూర్చోగానే తీయగా పలకరించింది. ఉండండి స్వీట్లు తెస్తా అంది.

దరిద్రం నెత్తిన కూచున్న మనవాడు కాస్త ఆగుతాడా? ఆగడు. " వావ్ ఏంటి విశేషం. ఎవరిదన్నా బర్త్ డే నా? ఎవరిచ్చారు ఇవి" అని అడిగాడు. ఇంకేముంది
భార్యతో భర్త దబిడదబిడే..దీనిపై మరింత చదవండి :