1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

అందుకే కోపం రాలేదు

ప్రేమాయణం జోకులు కుక్క కారు అందుకే కోపం రాలేదు
ఓ ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద వెళ్తుంటే ఓ రోమియో వారిని చూచి గట్టిగా విజిల్ వేస్తూ వెంటపడడం ప్రారంభించాడు. దాంతో ఆ ఇద్దర్లో ఓ అమ్మాయికి బాగా కోపం రాగా... మరో అమ్మాయి మాత్రం ముసి ముసిగా నవ్వడం ప్రారంభించింది.

వాడు మనల్ని చూచి అలా విజిల్ వేస్తుంటే కోప్పడాల్సింది పోయి నవ్వుతావేంటే... అంటూ అర్ధం కాక ఫ్రెండ్‌ను అడిగింది మొదటి అమ్మాయి.

రోడ్డు మీద వెళ్లే కారును చూచి కుక్కులు గట్టిగా మొరుగుతాయి కానీ ఆ కుక్కలు ఎప్పటికీ ఆ కారును మాత్రం ఎక్కలేవు... ఇప్పుడు మనల్ని చూచి విజిల్ వేస్తోన్న ఆ రోమియోను చూస్తే నాకు ఆ విషయం గుర్తొచ్చి నవ్వొచ్చిందే... అంటూ చెప్పింది రెండో అమ్మాయి.