1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ కవితలు

వెన్నెల దేవతలా కదలివచ్చి...

ప్రేమ కవితలు ప్రియురాలు ప్రేయసి వెన్నెల రాజు చంద్రుడు
WD
ప్రియా...

సాయం సంధ్యలలో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది


ఐతేనేం... పున్నమి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల రాజు కాంతుల్లో...
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
నా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...

నీ ప్రియుడు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి