ఆకర్షించే (దొంగ)చూపులు
ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ఓరకంటితో చూడడం మొదలుపెట్టాడంటే అప్పటికప్పుడే కాకపోయినా కొద్ది సమయానికి ఆ చూపులు తప్పకుండా ఆ అమ్మాయికి గుచ్చుకుని తీరుతాయి. ఇక ఆ క్షణం నుంచి వీడెందుకు నా వంక అలా చూస్తున్నాడు అని ఆ అమ్మాయి బుర్ర ఆలోచించడం ప్రారంభిస్తుంది.
అలా కొంతసేపు ఆలోచించిన తర్వాత వీడు చూస్తున్నది నన్నేనా లేక నా పక్కనున్నవారినా అంటూ ఆ అమ్మాయిలో చిన్న సందేహం మొగ్గ తొడుగుతుంది. మరి కాసేపు గడిచాక అదే పనిగా నన్ను చూస్తున్నాడంటే నామీద ఏదైనా ఆకర్షణ కలిగిందా అంటూ ఆ అమ్మాయిలో ఓ ప్రశ్న తలెత్తుంది.
అలా పుట్టిన ఆ ప్రశ్నకు మీరు ఆకట్టుకునేలా సమాధానం చెప్పగల్గితే ఇక ఆ అమ్మాయి వంక మీరు దొంగ చూపులు చూడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయే మీ వంక దొంగచూపులు చూడడం ప్రారంభిస్తుంది. అందుకే ప్రేమ మైకం కమ్మినవేళ మీకు నచ్చిన అమ్మాయి వంక కాస్త దొంగచూపులు చూడండి.
అయితే మీ దొంగచూపులు ఆమెను మాత్రమే పలకరించాలి సుమా. అలాకాక మీ దొంగచూపులు తననే కాక మరికొందర్ని కూడా చూస్తున్నాయని మీ ప్రేయసి గుర్తించిందా ఇక మీ పని అయిపోయినట్టే. ఆ తర్వాత మీ చూపులే కాకుండా మీరు సైతం ఆమెకు దొంగలాగే అనిపిస్తారు.
ఈ చిక్కులేవీ వద్దనుకుంటే మీది దొంగచూపులైనా అందులో ఉన్న నిజాయితీని ఆమెకు కన్పించేలా చేయండి. మీ ప్రేమ సామ్రాజ్యానికి ఆ చూపులే పునాదులవుతాయి. ఆ పునాదులపై మీ ప్రేమ సౌధాన్ని మీరు ఎంచక్కా నిర్మించుకోవచ్చు.