1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ప్రేయసి మనసు గెలిచారా... ?

ప్రేయసి మనసు గెలిచారా
WD PhotoWD
చూచిన తొలి చూపులోనే అమ్మాయికి ఐలవ్యూ చెప్పేసి అటుపై అమ్మాయి వద్దాన్నా బతిమాలో లేక హీరోయిజాన్ని ప్రదర్శించో ప్రేమలోకి దించడానికి జీవితం సినిమా కాదు. తొలిచూపులోనే ఐలవ్యూ చెప్పాలనిపించడం తప్పుకాకపోయినా అలా చెప్పడం మాత్రం తప్పే.

ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఎదురుగా వచ్చి ఐలవ్వూ అంటే ఏ అమ్మాయి అయినా ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీ ప్రేయసి సైతం అలానే రిసీవ్ చేసుకుంటుంది. సినిమాలో డైరెక్టర్ చెప్పినట్టు హీరోయిన్‌ వింటుంది కాబట్టి ఎన్ని వేషాలేసినా హీరోయిన్ హీరోనే ఇష్టపడుతుంది.
  ఆ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే తొలిచూపులోనే ఐలవ్యూ చెప్పేసి ఆపై ఆ అమ్మాయి దగ్గర ఛీ కొట్టించుకునే సాహసాన్ని మీరు చేస్తారా చెప్పండి.      


కానీ నిజజీవితంలో అలాగే జరగాలంటే అస్సలు కుదరదు. మీకు నచ్చిన అమ్మాయి మీకు హీరోయినే అయినా ఆమెకు నచ్చే వరకు మీరు మాత్రం ఆమెకు హీరో కాదు. ఆ విషయాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుంటే తొలిచూపులోనే ఐలవ్యూ చెప్పేసి ఆపై ఆ అమ్మాయి దగ్గర ఛీ కొట్టించుకునే సాహసాన్ని మీరు చేస్తారా చెప్పండి.

మరి తొలిచూపులో చెప్పొందంటే మరి ఎప్పుడు నచ్చిన అమ్మాయికి ఐలవ్వూ చెప్పాలంటారు అన్నదేగా మీ సందేహం. తొలిచూపులోనే ఐలవ్వూ చెప్పొద్దని మీతో ఎవరన్నారు. మీకు నచ్చిన అమ్మాయికి తొలిచూపులోనే ఐలవ్యూ చెప్పండి. అయితే అది మీ మనసులోనే సుమా.

మీ మనసు స్పందించి మీ పెదాలు చెప్పాలనుకునే ఐలవ్యూ పదాన్ని తొలిచూపులోనే పెదవులు దాటించకండి. అంతకుముందు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అవన్నీ చేశారంటే మీరు నచ్చిన ప్రేయసి తనంత తానుగా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రకృతి మొత్తం వినిపించేలా అప్పుడు చెప్పండి ఐలవ్యూ అని. ఎంత గొప్ప అమ్మాయి అయినా అప్పుడు మీ లవ్‌కు నో అని చెప్పే ఛాన్స్ చాలా తక్కువ.

ఎలాంటి అమ్మాయి అయినా తనకు నచ్చే మగాడిలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది. అందులో దేహ సౌందర్యం కాస్త ప్రధానమైనా అన్ని విషయాలూ నచ్చితే అబ్బాయి దేహ సౌందర్యానికి అమ్మాయిలు ఇచ్చే ప్రాధాన్యత చాలా వరకు తగ్గుతుంది. అందుకే మీరు పర్సనాలిటీలో హీరోలా లేకపోయినా మీలో హీరోయిజం లక్షణాలకు కొదవలేదని అమ్మాయి ముందు నిరూపించే ప్రయత్నం చేయండి.


అవకాశం వచ్చినప్పుడు అమ్మాయిని మాటల్లో పెట్టండి. మీలో అంతగొప్ప వాక్చాతూర్యం లేకపోయినా మీ మాటలు ఎదుటివారిలో ఆసక్తి రేకెత్తిస్తే చాలు మాట్లాడే విషయంలో మీరు విజయం సాధించినట్టే. అలాగే ఆమెకు నచ్చిన విషయాలు, నచ్చే చేష్టలేంటో సమయానుకూలంగా తెలుసుకోండి. వాటి ప్రకారం మీరు కాస్త ట్యూన్ అవ్వండి చాలు.

నా బాయ్ ఫ్రెండ్ ఎంత మంచివాడో అని ఆ అమ్మాయి తన స్నేహితుల వద్ద చెప్పే వరకూ తీసుకురండి. ఇక కావల్సిన కార్యం వారే చేసి పెడుతారు. ఏంటోయ్ వాడి గురించి అంతలా పొగిడేస్తున్నావ్ అంటూ వాళ్లు అడిగే చిలిపి ప్రశ్నకు ఆమె బుగ్గలు కెంపులు కాకపోవు. అటుపై మిమ్మల్ని చూచిన సమయంలో ఆమె చూపులు నేలకేసి చూడకపోవు.

అలాంటి తరుణం వచ్చిన తర్వాత ఓ శుభదినాన ఐలవ్యూ అన్న ఆ మూడు పదాలు ఉచ్చరించండి. ఆ సమయం నుంచి మీరిద్దరూ స్నేహితులనే స్థితి నుంచి ప్రమోషన్ పొంది ప్రేమికులనే స్థానాన్ని చేరుకుంటారు. అటుపై ఐలవ్యూ అని మీ ప్రేయసికి చెప్పాలంటే మీకు ఎవ్వరి సలహాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రేమలో జయించిన వీరునిగా మీరే ఎదుటివారికి సలహా ఇచ్చే స్థితిలో ఉంటారు.
About Writer
Munibabu