1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Chidambaram once again disappointed

చిదంబరానికి మరోసారి నిరాశ

Chidambaram
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి ఐఎన్ఎక్స్‌ మీడియా కేసులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

ఆయనపై ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన చురుకైన, కీలక పాత్ర పోషించినట్టు జస్టిస్ సురేష్ కుమార్ కెయిత్ అభిప్రాయపడ్డారు.

'నిస్సందేహంగా బెయిలు కోరడం ఆయన హక్కు. అయితే ఇలాంటి కేసుల్లో బెయిలు మంజూరు చేస్తే అది ప్రజాప్రయోజనాలకు విరుద్ధమవుతుంది' అని న్యాయమూర్తి అన్నారు.
తర్వాతి కథనం
తల్లిదండ్రుల అరాచకంపై చట్టాలు రావాలి : స్పీకర్‌