భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి..

romance
Last Updated: శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:58 IST)
భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. కొన్ని నెలల పాటు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ సెక్స్ గుట్టును డెహ్రాడూన్ పోలీసులు రట్టు చేశారు. ఈ రాకెట్‌లో ఏడుగురు వున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఆరుగురు యువతులను డెహ్రాడూన్‌కు రప్పించి, వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎర వేశారు.

అక్కడికి వెళ్లాక ఓ ఇంటిలో వారితో వ్యభిచారం చేయించారు. అక్కడే కాకుండా వారిని వివిధ ప్రాంతాలకు పంపిస్తూ సెక్స్ రాకెట్ నడిపారు. అయితే, ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రంగంలోకి దూకిన పోలీసులు నిఘా పెట్టి ఓ చోట కారులో నిందితులను అదుపులోకి తీసుకొని, యువతులను రక్షించారు. అమిత్ అనే వ్యక్తి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.దీనిపై మరింత చదవండి :