1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Did Amma Really Die On Dec 4th?

డిసెంబర్ 4వతేదీనే అమ్మ చనిపోయారు.. 5న కాదు: దివాకర్

దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అమ్మపై దివాకర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు

Jayalalithaa
దివంగత సీఎం జయలలితపై చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకర్ సంచలన ప్రకటన చేశారు. 75రోజుల పాటు చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అమ్మపై దివాకర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని అపోలో తెలిపిందని.. అయితే అందులో నిజం లేదని దివాకర్ వ్యాఖ్యానించారు. 
 
జయలలిత డిసెంబర్ 4 వతేదీ సాయంత్రం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారని స్పష్టం చేశారు. చెన్నైలోని అపోలో బ్రాంచులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించిన తర్వాతే అమ్మ మరణవార్తను ప్రకటిస్తామని అపోలో యాజమాన్యం తెలిపిందని.. అందుకే డిసెంబర్ 4న అమ్మ చనిపోతే..డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయినట్లు ప్రకటించారని దివాకర్ తెలిపారు. 
తర్వాతి కథనం
రజనీకి సీఎం అయ్యే యోగ్యం లేదట.. ఎవరు...