శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (11:52 IST)

రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఎంపీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 'రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పందించాల్సిందీ.. చెప్పాల్సిందీ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు.