బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (11:39 IST)

మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?

సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే మనశ్శాంతి కరువైతే? తాజాగా ఓ స్వామీజీ మనశ్శాంతి లేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లా శిహట్టి తాలూకాలోని బాలేహోసూరులో ఉన్న దింగాలేశ్వర మఠంలో జరిగింది.
 
ఈ మఠంలో ఉండే మహాలింగ స్వామీజీ (38) మనశ్శాంతి దక్కలేదన్న కారణంతో ఆదివారం అర్థరాత్రి సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
 
ఈ విషయాన్ని సోమవారం ఉదయం ఆశ్రమానికి వచ్చిన కొంతమంది భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా తాను మనశ్శాంతిని కోల్పోయానని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. పైగా, తనన భౌతికకాయాన్ని మఠంలోనే సమాధి చేయాలని కోరారు.