శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (09:46 IST)

భార్య విడాకులిచ్చిందని.. 80 మాత్రలు మింగేశాడు..

భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్

భార్యాభర్తల బంధం విడాకులతో తెగిపోయింది. భార్య విడాకులు ఇచ్చేసిందనే మనస్తాపంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మాత్రలు మింగేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం, బడా భీమ్‌గల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్ మండ‌లం బ‌డా భీమ్‌గ‌ల్‌లో రాజు (27) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 
 
కొన్ని కారణాల వ‌ల్ల భార్య త‌న‌కు విడాకులు ఇచ్చింద‌ని మ‌న‌స్తాపం చెందుతోన్న ఆ వ్య‌క్తి ప‌లు మాత్ర‌లు సేక‌రించి వాటిని మింగేశాడు. అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్న అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించినప్పటికీ  అతడు మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.