శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (09:41 IST)

మానవత్వం మంటగలిసిపోయింది.. నడిరోడ్డుపై నిండుప్రాణం బలి.. ఎలా?

స్మార్ట్‌ఫోన్లు, ఆధునిత ప్రభావంతో మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషికి మనిషే సాయం చేసుకోని రోజులు వచ్చేశాయి. అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీకి చెందిన

స్మార్ట్‌ఫోన్లు, ఆధునిత ప్రభావంతో మానవత్వం మంటగలిసిపోతోంది. మనిషికి మనిషే సాయం చేసుకోని రోజులు వచ్చేశాయి. అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీకి చెందిన పొన్నాడ అచ్యుత్ (50) ఎల్‌ఐసీ ఏజెంట్. వారం రోజుల పాటు దగ్గుతో బాధపడుతూ వస్తున్న అచ్యుత్.. బుధవారం కుమారుడు విష్ణుతో కలిసి ఆర్టీసీ బస్సులో విశాఖకు బయలుదేరాడు. 
 
బస్సు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఫ్లై ఓవర్ వద్దకు చేరుకునే సరికి అచ్యుత్ అస్వస్థతకు గురైయ్యాడు. గుండెల్లో నొప్పిగా ఉందని కుమారుడికి చెప్పాడు. విష్ణు కండక్టర్‌కు విషయం చెప్పి ఏదైనా ఆసుపత్రి కనిపిస్తే ఆపాలని కోరాడు. ఈ క్రమంలో చాకివలస చౌరస్తా వద్దకు వచ్చేసరికి అచ్యుత్‌కు నొప్పి ఎక్కువై విలవిల్లాడిపోయాడు. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపేసి అచ్యుత్, అతడి కుమారుడిని నడిరోడ్డుపై దించేశాడు. 
 
అక్కడ నుంచి ఓ ఆటో డ్రైవర్ వారిని ఎక్కించుకున్నాడు.. కానీ మధ్యలోనే అచ్యుత్‌ను, విష్ణు దింపేశాడు. గుండెనొప్పితో కొట్టుమిట్టాడుతున్న అచ్యుత్‌ను ఆస్పత్రిలో చేర్పించడం కోసం ఆటోలు, పక్కనున్న వారిని ఎంత గెంజుకున్నా ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం నడిరోడ్డుపై బలైంది. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో జరిగింది. 
 
ఆటో డ్రైవర్ ఇంకాస్త దూరం తీసుకెళ్లివుంటే ఆస్పత్రిలో చేర్పించి వుండే వారిమని.. నడిరోడ్డు తండ్రి తన చేతుల్లో చనిపోయాడని విష్ణు రోదించాడు. మనుషుల్లో మానవత్వం మాయమవుతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనమని విష్ణు కన్నీళ్లుపెట్టుకున్నాడు.