ప్రపంచంలోనే స్మాలెస్ట్ మొబైల్ ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ అతి పెద్ద మొబైల్ ఫోన్‌ను (బిగ్ స్క్రీన్) వాడేందుకు ఇష్టపడుతున్నారు. కానీ, ఇంగ్లండ్‌కు చెందిన ఓ కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ఫోన్‌ను తయారు

Zanco Tiny mobile
pnr| Last Updated: గురువారం, 21 డిశెంబరు 2017 (12:56 IST)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ అతి పెద్ద మొబైల్ ఫోన్‌ను (బిగ్ స్క్రీన్) వాడేందుకు ఇష్టపడుతున్నారు. కానీ, ఇంగ్లండ్‌కు చెందిన ఓ కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ఫోన్‌ను తయారు చేసింది. ఆ కంపెనీ పేరు జాంకో. ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ఫోన్‌గా జాంకో టినీ టీ1 ఫీచర్ ఫోన్ ఎంపిక అయింది.

ఇందులో ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. 2జీ బ్యాండ్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 50 ఎస్ఎంఎస్‌వుస 50 కాల్ లాగ్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకోవవచ్చు. ఈ ఫోన్ కేవలం 13 గ్రాములు మాత్రమే.

ఈ ఫోన్ మరో విశేషమేమిటంటే, మన చేతి బొటన వేలుకన్నా చిన్నది.. 10 రూపాయల కాయిన్ కన్నా తక్కువ బరువు ఉంటుంది. ఈ ఫోన్ 2018 మే నెలలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.2,500. ఈ బుల్లి ఫోన్‌లో బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే, 0.49 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, 32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, మీడియా టెక్ ఎంటీకే 6261డి మదర్‌బోర్డు, 2జీ, 32 ఎంబీ స్టోరేజ్‌, 200 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, 3 రోజులు స్టాండ్‌బై, 180 నిమిషాల టాక్‌ టైం వంటి ఫీచర్లను కలిగివుంది.దీనిపై మరింత చదవండి :